క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్ పేరు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా సారా పెళ్లిపై మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.స్టార్ హీరో సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ నటుడు రాజ్వీర్ డియోల్‌తో సారా టెండూల్కర్ వివాహం జరగబోతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 30 ఏళ్ల సారా, 32 ఏళ్ల రాజ్వీర్ వచ్చే ఏడాది (2027లో) వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.