వనపర్తి సర్కారు బడిలో చదివి తెలంగాణకు సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన గురు పూజా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 127 మంది ఉపాధ్యాయులను సన్మానించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లల గొప్ప భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని, పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడంలో వారిదే కీలక పాత్ర అని తెలిపారు.