ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 169.46 టీఎంసీలకు చేరింది. ఈ క్రమంలో అధికారులు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 66,460 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.