వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ పోలీసు వేషధారణలతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దిగజార్చేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీసు వ్యవస్థను, యూనిఫాం పవిత్రతను దెబ్బతీసేలా నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో కొనసాగే కనీస అర్హత కూడా లేదని వ్యాఖ్యానించారు.