భారత సంతతికి చెందిన చెస్ మేధావులు 11 ఏళ్ల బోధనా శివానందన్, 17 ఏళ్ల శ్రేయస్ రాయల్ 2026 బ్రిటీష్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. కోవెంట్రీలో ముగిసిన ఈ పోటీలలో, బోధన బ్రిటన్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా చెస్ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు పుటలకెక్కింది. ఆగ్నేయ లండన్‌కు చెందిన 17 ఏళ్ల శ్రేయస్ రాయల్ తొమ్మిది రౌండ్ల పాటు సాగిన పోరులో అగ్రస్థానంలో నిలిచి తన తొలి బ్రిటీష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.