ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యవంశీకి కెప్టెన్ శ్రేయస్ పూర్తి మద్దతుగా నిలిచారు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌తో వైభవ్ ప్రతిభను అంచనా వేయలేమని స్పష్టం చేశారు. “వైభవ్ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే ఎంతో నేర్చుకోవచ్చు. తన వయసుకు మించిన పరిణతి, అంతులేని ఆత్మవిశ్వాసం అతని సొంతం. అరంగేట్రం మ్యాచ్‌లో అతను ఎంతమాత్రం ఒత్తిడికి గురైనట్లు అనిపించలేదు. అతని భయం లేని ఆటతీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. భవిష్యత్తులోనూ అతనికి మా పూర్తి మద్దతు ఉంటుంది” అని అయ్యర్ పేర్కొన్నారు.