ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను రోజుల పాటు నిర్వహిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్‌బీసీ’ (CNBC) పేర్కొంది. తీవ్రమైన ఎండ వేడి ఉన్నప్పటికీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌కు నివాళులర్పించేందుకు లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి తరలివచ్చారు. ప్రజల కోసం అధికారులు చల్లని పానీయాలు, వాటర్ స్ప్రేలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఖమేనీ పోస్టర్లు పట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా, కక్ష తీర్చుకుంటామంటూ భారీగా నినాదాలు చేశారు.