ఉత్తరాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్‌కు పోలీసు యంత్రాంగం గట్టి షాక్ ఇచ్చింది. హర్యానాలోని బహదూర్గఢ్ పరిధిలో జరిగిన ఒక భారీ ఎదురుకాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఇద్దరు కీలకమైన హంతకులు హతమయ్యారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ (కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్), హర్యానా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ అత్యంత పక్కా ప్లాన్‌తో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కూడా తూటా గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.