డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌పైనా బహిరంగంగా సభ్య సమాజం తలదించుకునేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్ కుమార్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. శ్రవణ్‌కుమార్ పిటిషన్‌పై మన ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా వాదించలేక పోయారో ఏమో తెలియదు గానీ, ఆ కేసును నాలుగు వారాలు వాయిదా వేసిన కోర్టు.. శ్రవణ్‌కుమార్‌పై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని తెలియజేయడం పైనా స్పందించారు.