ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఖరారైంది. సోమల రఘురామ్ రెడ్డితో అంజిలి రెడ్డి వివాహం జరగనుంది. షర్మిల తన కుటుంబ సభ్యులతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించారు. వివాహానికి సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు.