అక్రమ వలసలను అరికట్టడానికి యూకే ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం కింద తొలికేసు నమోదైంది. ఈ చట్టం కింద ఓ భారతీయుడిపై పోలీసులు నేరాభియోగాలు నమోదుచేశారు. వెస్ట్ మిడ్ ల్యాండ్ లో స్మెత్విక్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల హేమ్ రాజ్ పై అక్రమవలసల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. నకిలీ వీసా, శరణార్థి దరఖాస్తులకు సంబంధించి సలహాలు ఇస్తామని అతడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు అతడిని అరెస్టు చేశారు.