ఆంధ్రప్రదేశ్‌లో షిప్‌బిల్డింగ్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించనుంది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో MDL, నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ (NSHIP-AP) మధ్య అవగాహన ఒప్పందం (MoU) జరిగింది. ప్రాజెక్టు కింద వచ్చే ఐదేళ్లలో MDL సుమారు రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టేలా ప్రణాళిక రూపొందించారు.