ఒకప్పుడు ‘నిఠారీ రాక్షసుడు’గా ముద్రపడిఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 31లో 2006లో సంచలనం సృష్టించిన నిఠారీ గ్రామానికి చెందిన పేదలు, కూలీల కుటుంబాలకు చెందిన 19 మంది పిల్లల హత్యలు, నరమాంస భక్షణకు సంబంధించిన 2006 నాటి హత్యల కేసులో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఒక టీస్టాల్ లోపల ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో అతడి మృతదేహం కనిపించింది.