తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – పొలిటికల్)గా నియమించిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఈ నియామకంపై మిత్రపక్షాలూ, ప్రతిపక్షాలూ వ్యతిరేకించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో ఓ జ్యోతిష్కుడికి ముఖ్యమైన పోస్ట్ ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

