విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భద్రతకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు తమ యూనిట్‌ను నవంబర్ 17 నాటికి పూర్తిగా ఖాళీ చేయాలని, సర్క్యులేట్ అవుతున్న ఈ ఉత్తర్వుల కాపీపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.