యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
కంపెనీలోని సి-బ్లాక్‌లో నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.