రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అత్యంత దారుణ రూపం దాల్చుతోంది. సెంట్రల్ ఉక్రెయిన్లోని కీలక నగరమైన క్రివీ రిహ్ (Kryvyi Rih) పై రష్యా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. నడిరోడ్డుపై, పగటిపూటే అత్యంత రద్దీగా ఉండే ఒక అతిపెద్ద షాపింగ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో 14 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.