ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకేసులో తమ కుమారుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు త్రీకరించడాన్ని నిందితుడి తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. తమ కొడుక్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, అసలు మద్యం అలవాటే లేదని మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న వ్యక్తి తమ కుమారుడు కాదని, రూపురేఖలను తాము గుర్తించలేకపోతున్నామని తెలిపారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత తమ కొడుకుని పోలీసులు తీవ్రంగా టార్చర్ చేసి,
లేని నేరాన్ని అంగీకరించేలా ఒత్తిడి తెచ్చారని కొడుకు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు.