మెగా అభిమానులకు అన్నయ్య బర్త్ డే స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ క్యూరియాసిటీ మరింత పెంచేలా ‘మెగా 158’ నుంచి టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. మెగాస్టార్‌కు స్పెషల్ బర్త్ డే విషెష్ చెబుతూ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ‘మెగా 158’ మూవీకి కాకా (Kaaka) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. కాకా అంటే అన్నయ్య అనే అర్థం వస్తుంది. మాస్ టైటిల్‌తో క్రేజ్ నెలకొనగా స్టోరీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.