కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా ఆసియా క్రీడల ముందు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్ లసానే డైమండ్ లీగ్‌లో విజేతగా నిలుస్తాడనిపించింది. కానీ, ఊహించినట్టుగానే శ్రీలంక స్టార్ రుమేశ్ థరంగ పథిరంగే నీరజ్‌ను దాటేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. ఆసియా క్రీడలపై దృష్టి సారించనున్నాడు.