విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా యూకే పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు.ఈ మేరకు అక్కడి ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ఫైసల్ దేవీతో సమావేశమయ్యారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యం అవకాశాలపై చర్చించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆక్స్ఫర్డ్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. వర్సిటీలోని సోమర్విల్లే కాలేజీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సీఎం సందర్శించారు.