ఎవరైనా ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చేందుకు వారు నిర్వహించే పదవికి, పర్యటన ఉద్దేశ్యానికి ప్రతిపాదిత ప్రోగ్రామ్ తగినట్లుగా ఉండాలన్నారు. ‘ఈ నిర్దిష్ట విషయంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) పర్యటనకు సంబంధించి నిబంధనలు పాటించలేదు. వారి పర్యటన ఉద్దేశం పదవికి తగినట్లుగా సరిపోలలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి క్లియరెన్స్ నిరాకరించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.