సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమా నుంచి ‘అల బొలేలో’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వర పరిచిన ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించాడు. శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించాడు. టాలీవుడ్ బ్యూటీ పూర్ణ ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అసలు పూర్ణ డ్యాన్స్ మాత్రం వేరే లెవల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది.