ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 900 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలను వివరిస్తూ ఆక్స్ఫర్డ్ ప్రతినిధులతో ఆయన కీలక చర్చలు జరిపారు. ఆక్స్ఫర్డ్ విద్యావేత్తలను హైదరాబాద్కు ఆహ్వానించారు. తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించేందుకు హైదరాబాద్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు.