‘బాసింగ బలాలు’ పాట డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వివాదం నేపథ్యంలో తనపై అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య కొందరితో కలిసి వచ్చి అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా దాడి కూడా చేశారని వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసి తన పరువుకు భంగం కలిగించారని. అంతే కాకుండా రూ.50 వేల విలువైన ఐఫోన్ ను దొంగిలించారని మాధురి తీవ్ర ఆరోపణలు చేసింది.