దేశంలో పాఠశాల విద్య, అక్షరాస్యత రరంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 48 మంది ఉపాధ్యాయులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026’ కు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను విజేతలకు ప్రదానం చేయనున్నారు. పురస్కారం అందుకున్న వారి కృషి, సేవలను తెలియజేసే లఘు డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు. ఎంపికైన 48 మంది ఉపాధ్యాయులలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు.