వికారాబాద్ జిల్లా యాలాల మండల పులే గురుకులంలో కుమారుడిని చూసేందుకు తల్లి పలుమార్లు స్కూలు రావడంతో ఆమెతో ప్రిన్సిపాల్ మెగావత్ నరేష్ పరిచయం పెంచుకున్నాడు. ఫోన్లో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. కుమారుడిని స్కూల్‌లో కలిసి బయటకు వెళ్తుండగా ప్రిన్సిపాల్ ఆమెతో మాట్లాడాడు. ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ప్రిన్సిపాల్ ఆమెను కారు ఎక్కాల్సిందిగా కోరాడు. అగ్గనూరు గ్రామ శివారులోకి వెళ్లిన తరువాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో తన కుటుంబ సభ్యులకు మహిళ సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ప్రిన్సిపాల్‌పై దాడి చేశారు