యూకేలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. లండన్ లోని హీత్రూ, స్టాన్ డ్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే అనేక సర్వీసులు రద్దయ్యాయి. దీంతో పాటు మాంచెస్టర్, బర్మింగ్హామ్ తదితర నగరాల్లోని ఎయిర్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటివరకు దాదాపు 300 విమానాలు రద్దయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారని, సేవల పునరుద్ధరణకు కొంత సమయం పడుతుందని బ్రిటన్ ‘నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్’ తెలిపింది.