బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్‌పై దాడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి గూండాలు, రౌడీలను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పంపించిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దాడుల నుండి కెసిఆర్‌ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని ఆయనన్నారు. కెసిఆర్‌ను అంతమొందించేందుకే వెళ్తున్నామని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై పోలీసులు వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు