కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలో ABC ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పరిశ్రమ లోపల భారీగా పెయింట్లు, కెమికల్స్, ద్రవపదార్థాలు మరియు కాగితపు నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు పరిశ్రమ అంతటా విస్తరించి, ఆకాశాన్ని తాకేలా దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. ప్రింటింగ్ ప్రెస్ లోపల ఉన్న పెయింట్స్, రసాయనాల వల్ల మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, వాటిని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.