ప్రపంచకప్ లో కాషాయం జెర్సీతో కనిపించిన భారత హాకీ జట్లు.. ఇప్పుడు మళ్లీ తమ సంప్రదాయ నీలి రంగులోకి వస్తున్నాయి.ఆసియాడ్ కు బ్లూను తొలి ఎంపికగా ఇచ్చింది. కాషాయం రెండో ఎంపికగా ఉంటుంది. భారత జట్ల జెర్సీ రంగుపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ప్రపంచకప్ కు ముందు సంప్రదాయ బ్లూ స్థానంలో కాషాయాన్ని హాకీ ఇండియా ఎంపిక చేసింది. బ్లూ జెర్సీ.. బ్లూ సింథటిక్ టర్ఫ్ కలిసిపోవడంతో ఆటగాళ్లకు కనిపించడంలో ఇబ్బంది ఉండొచ్చని హాకీ ఇండియా వివరించింది.