కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో 19 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ కు ప్రజామద్దతు పెరుగుతోంది. సోనమ్ వాంగ్ చుక్ వద్దకు ఇవాళ సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ సోనమ్ నిరాహారదీక్షపై మౌనంగా ఉన్న బాలీవుడ్ కూడా ఇవాళ గొంతు విప్పుతోంది.