ఒడిశా లోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీలోని మారిచికుండ్ కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన తాళ్ల బారికేడ్ కూలిపోవడం, కొందరు భక్తులు పట్టుతప్పి కింద పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. సుమారు 100 మంది ఒకేచోట పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. వారిలో నలుగురైదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

