తమిళనాడు టీవీకే ప్రభుత్వం తన మొట్టమొదటి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో విద్యారంగానికే పెద్ద పీట వేశారు.పాఠశాల విద్యకు అత్యధికంగా రూ. 44,527 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 8,393 కోట్లను కేటాయించారు. కాలేజీ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రవేశపెట్టిన వెట్రి ల్యాప్‌టాప్ పథకం కింద రూ.2,000 కోట్లను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య లోపాలను నివారించి మెరుగైన వసతులు కల్పించడానికి రూ.139 కోట్లతో సూపర్ క్లీన్- సూపర్ క్యాంపస్ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 10,000 పాఠశాలల్లో అమలు చేయనున్నారు.