మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారిని స్థానికులు చుట్టుముట్టారు. ఓ దుకాణంలో కొనుగోలు చేసిన స్నాక్ తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. గడువుతీరినవి తిన్నందువల్లే ఇలా జరిగిందని ఎఫీఏ అధికారిని స్థానికులు చుట్టుముట్టి గడువుతీరిన బిస్కెట్ ప్యాకెట్లను ముందుంచి వాటిని తినాలని నినాదాలు చేశారు. కొందరు వాటిని నోట్లో పెట్టేందుకు ప్రయత్నించారు. దుకాణదారుడిని కాపాడటానికి లంచం తీసుకున్నారని స్థానికులు ఆరోపించారు.