బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయకుండా కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి దున్నపోతు ఈనిందంటే.. కిషన్ రెడ్డి దూడను కట్టేయమంటాడని విమర్శించారు కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.