తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు ఎంపిడివో ఆఫీసు వద్ద నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సిపి అభ్యర్థులపై రాళ్లదాడి జరిగింది. పోలీసు జీపులో వెళ్తున్న వైసిపి అభ్యర్థులను టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాళ్లదాడి జరగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.