విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయాలని, ఆత్మనిర్భరత వైపు పౌరులను ప్రేరేపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో తలెత్తుతున్న రుగ్మతలు, కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దిల్లీలోని భారత మండపంలో అక్టోబర్ 23 నుంచి 25 వరకు జరగనున్న చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పురోగతి అనేది జాతీయ అభివృద్ధికి ఒక సాధనంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.