ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, డిండి ఎత్తిపోతలు, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలక చర్చలు చేశారు. తుమ్మిడిహెట్టిపై త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ఈనెల 23 తర్వాత చర్చలకు పిలుస్తామని ఇటీవల మహారాష్ట్ర సీఎం సూచన ప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా బ్యారేజీ ఎత్తు ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.