మలేరియా వ్యాక్సిన్ల విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ (గవి ), యూనిసెఫ్లతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ‘మాస్క్వివాక్’ (RTS,S/AS01) ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గవి, యూనిసెఫ్, భారత్ బయోటెక్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల మలేరియా వ్యాక్సిన్ ‘మాస్క్వివాక్’ ధర 40 శాతం మేర తగ్గనుంది.