రూ.140 తేడా వల్లనే లక్షల మంది భవిష్యత్తు బలి అయింది. నీట్ పేపర్ లీక్ వెనుక L1 మాయాజాలం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అపారమైన అనుభవం, అత్యాధునిక సాంకేతిక భద్రత కలిగిన TCS వంటి సంస్థను కేవలం 140 వ్యత్యాసం కారణంగా పక్కన పెట్టడం, ఒక్కో అభ్యర్థికి TCS కోట్ చేసిన రూ. 311కు బదులుగా, కేవలం రూ.171కే నిర్వహిస్తామన్న EduQuest సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడమే కొంపముంచిందని తాజాగా గుర్తించారు. EduQuest సైబర్ సెక్యూరిటీ వైఫల్యాలే పేపర్ లీక్‌కు దారితీశాయని స్పష్టమవుతోంది.