కర్నూలు ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్ల క్రితం నంద్యాల జిల్లాకు చెందిన ఒక యువతిని మాయమాటలతో లోబరుచుకున్న ఎస్సై , యువతిని వేధిస్తూ వ్యక్తిగత ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్‌ను డబ్బు కోసం వేధించినట్లు, డ్రైవర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం వీడియోను నేరుగా మంత్రి లోకేష్‌కు పంపడంపై విచారణ నివేదిక ఆధారంగా హరిప్రసాద్‌ను సర్వీసు నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
.