కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత కోరారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఫొటోలు బయటపెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు కుమారుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బండి సంజయ్ ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం శోచనీయమని విమర్శించారు.

