బెంగళూరు నగరంలో భార్య రీల్స్ చూస్తూ ఇంట్లో సకాలంలో వంట చేయడం లేదనే చిన్న కోపంతో, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బీహార్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ కుమార్, హత్య చేశాడు. ఈ ఘోర ఘటన బెంగళూరు నగరం పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీమా కుమారి ఖాళీ సమయంలో నిరంతరం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండేది. దీనివల్ల ఆమె ఇంట్లో సరిగా వంట చేయకపోవడం, ఇంటి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి.