అర్నబ్, మురసు తుపాన్లతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు.
రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చేలా కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మురసు తుపాన్ కారణంగా ఏడు జిల్లాల్లో 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని మరో లేఖలో వివరించారు. 50,473 హెక్టార్లలో వరి పంట, 1,985 హెక్టార్లలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని, ప్రాథమికంగా రూ.343 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు.