తెలంగాణ రాష్ట్రంలో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. వర్షాలు కురవకపోగా, మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి వంటల సాగులో బిజీగా ఉండాల్సిన రైతులు తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర మొత్తం మీద సగటున -27 శాతం మేర లోటు వర్షపాతం చోటు చేసుకుంది. ఈ నెల 1వ తేదీ నుండి గురువారం వరకూ 72.1 మిల్లీ మీటర్ల మేర సాధారణ వర్షం నమోదుకావాల్సి ఉండగా, 52.8 మిల్లీ మీటర్లు మాత్రమే చోటు చేసుకుంది.