విద్యా రంగంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరుతూ యువత నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి జూన్ 20వ తేదీన పెద్ద ఎత్తున దేశ రాజధాని వేదికగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.