అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల దిశగా ఒక ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. దక్షిణ లెబనాన్‌లోని నబతియే జిల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు అర్ధరాత్రి భారీ ఎత్తున వైమానిక, రాకెట్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు మరికొందరు గల్లంతయ్యారు ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఇదొకటని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.