నైజర్ రాజధాని నియామేలోని విమానాశ్రయంపై ఉగ్ర దాడి జరిగింది. దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 13 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లమిన్ ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నైజీరియన్ దేశానికి తాము మద్దతుగా ఉంటామని, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి తాము కలసి వస్తామనిపొరుగు దేశమైన అల్జీరియా తెలిపింది.