భద్రాద్రి జిల్లా గుండాలలో వైద్యుల నిర్లక్ష్యంలో తల్లి బిడ్డలు మృతి చెందారు. ఈ నెల 13న వనజకు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు లేకపోవడంతో వనజకు స్టాఫ్ నర్సు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పరిస్థితి విషమంగా మారడంతో తల్లి బిడ్డలు మృతి చెందారు. తల్లీబిడ్డల అంత్యక్రియలు పూర్తయ్యాక చితాభస్మంలో కత్తెర లభ్యమైంది. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డలు మరణించారని కుటుంబసభ్యుల ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేశారు.